తినే పదార్థం అనుకుని..... డ్రగ్స్ తీసుకున్న 17 నెలల బిడ్డ

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:51 PM

తినే పదార్థం అనుకుని..... డ్రగ్స్ తీసుకున్న 17 నెలల బిడ్డ

తినే పదార్థం అనుకుని డ్రగ్స్ తీసుకోవడం వల్ల 17 నెలల పసిబిడ్డ కోమాలోకి వెళ్లిపోయింది. స్పెయిన్‌లో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 3 గంటలకు బిడ్డకు మూర్ఛ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు వెంటనే బిడ్డను ఐసీయులో చేర్చి చికిత్స మొదలుపెట్టారు. మూత్ర పరీక్ష చేయగా.. బిడ్డ డ్రగ్స్ తీసుకోవడం వల్లే మూర్ఛ వచ్చిందని, ప్రస్తుతం కోమాలో ఉన్నట్టు తెలిపారు.

అనంతరం వైద్యులు పోలీసులు సమాచారమివ్వగా.. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు తల్లిదండ్రులిద్దరినీ అరెస్ట్ చేశారు. పసిబిడ్డను జాగ్రత్తగా చూసుకోనందుకు, ఇంట్లో డ్రగ్స్ ఉన్నందుకు గాను వారిపై కేసు నమోదు చేశారు. మరోపక్క తినే పదార్థం అనుకుని బిడ్డ డ్రగ్స్ తనంతట తానే తీసుకున్నాడా లేదా తల్లిదండ్రులే బిడ్డకు ఇచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements