యజమాని దగ్గర నుండి పారిపోయిన పాము

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:54 PM

యజమాని దగ్గర నుండి పారిపోయిన పాము

వాషింగ్ మెషీన్‌లో పామును చూసి అమెరికాలో ఓ మహిళ కంగుతింది. బట్టలను తీద్దామని వాషర్ ఓపెన్ చేయగా.. బట్టలతో పాటు పెద్ద పాము కనిపించడంతో మహిళ ఒక్కసారిగా భయాందోళన చెందింది. వెంటనే యానిమల్ రెస్క్యూ టీమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించింది. అక్కడకు చేరుకున్న అధికారులు వాషింగ్ మెషీన్‌లో పామును గుర్తించారు. వాషింగ్ మెషీన్‌లో పాము కనిపించడం ఇదే మొదటిసారి అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పామును చికాగోలోని పశువైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ పాము పేరు పెనె‌లోప్ అని కెమెన్సిక్ అనే ప్రాంతలో తన యజమాని నుంచి పారిపోయినట్టు పశువైద్యులు తెలుసుకున్నారు.





Untitled Document
Advertisements