బెడ్‌రూంలో 80 వేల తేనెటీగలు... షాక్ లో జంట

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 01:01 PM

బెడ్‌రూంలో 80 వేల తేనెటీగలు... షాక్ లో జంట

చెట్లపై, బిల్డింగ్‌లపై తేనెపట్టులను చూస్తూనే ఉంటాం. వాటి వల్ల ఎటువంటి హాని లేదని తెలిస్తే తేనెపట్టుల జోలికి ఎవరూ పోరు. స్పెయిన్‌లోని ఆండలూసియాకు చెందిన ఓ జంట మాత్రం తమ బెడ్‌రూం గోడపై రెండేళ్లుగా ఉన్న తేనెపట్టు నుంచి తేనెటీగల శబ్దం వస్తున్నా వాటి జోలికి పోలేదు. కొద్ది రోజులుగా ఆ శబ్దం మరింత ఎక్కువైపోవడంతో తేనెపట్టు పట్టే వాడిని పిలిచి సాయం కోరారు.

బెడ్‌రూం గోడపై ఉన్న తేనెపట్టును చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఆ తేనెపట్టులో దాదాపు 80 వేల తేనెటీగలు ఉన్నాయని, రెండేళ్ల నుంచి అన్ని వేల తేనెటీగల శబ్దాలతో బెడ్‌రూంలో అసలు ఎలా నిద్రపోతున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను ఇంత పెద్ద తేనెపట్టును మొదటిసారి చూస్తున్నానని చెప్పాడు.





Untitled Document
Advertisements