జియో కస్టమర్లకు గుడ్ న్యూస్

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 01:54 PM

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్

టెలికాం దిగ్గజం రిలియన్స్ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌తో దేశంలో అత్యధిక 4జీ నెట్‌వర్క్ కవరేజ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ దూసుకెళ్తోంది. భారత్‌లో వీవోఎల్‌టీఈ సేవలు ప్రారంభించిన తొలి కంపెనీగా రికార్డ్ కొట్టేసిన ముకేశ్ అంబానీ జియో ఇప్పుడు మరో ఘనత దక్కించుకునేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు వీవో‌వై-ఫై (వాయిస్ ఓవర్ వై-ఫై) సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ ఇప్పటికే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి సర్కిళ్లలో ఈ సేవలను పరీక్షిస్తోంది. కొందరు యూజర్లు వారి ఐఫోన్లలో జియో వీవోవై-ఫై సింబల్ కనిపిస్తోంది. అంటే పరీక్షలు తుది దశకు చేరుకున్నాయని భావించొచ్చు. ఇప్పటి వరకు అయితే కంపెనీ ఎప్పుడు పబ్లిక్ వై-ఫై సేవలు ప్రారంభించేది స్పష్టంగా తెలియదు. అయితే రానున్న నెలల్లోనే ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చు. జియో వై-ఫై సేవలు తొలిగా జియో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రావొచ్చు. కేవలం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కాకుండా జియో ఫోన్లలోనూ ఈ సేవలు పొందే వీలుండొచ్చు. జియో వైఫై సేవలు అందుబాటులోకి వస్తే సెల్యులర్ నెట్‌వర్క్‌తో పనిలేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. దీంతో గ్రామీణ ప్రాంతాలు, నెట్‌వర్క్ సరిగాలేని చోట్ల యూజర్లకు ప్రయోజనం కలుగునుంది.





Untitled Document
Advertisements