నేనంటే వణుకు...కానీ ఎవరూ బయటికి చెప్పరు

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 05:25 PM

నేనంటే వణుకు...కానీ ఎవరూ బయటికి చెప్పరు

వెస్టిండీస్‌ సంచలన ఆటగాడు క్రిస్‌ గేల్‌ విజయవంతంగా ఐదోసారి ప్రపంచకప్‌ టోర్నీలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రపంచకప్‌లో బౌలర్లకు తనతో తిప్పలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాడు గేల్. ఈ సందర్భంగా గేల్ మాట్లాడుతూ....‘ప్రపంచంలోని అన్ని జట్ల బౌలర్లకు నేనంటే వణుకు పుడుతుంది.. కానీ ఎవరూ బయటికి చెప్పరు’ అని పేర్కొన్నాడు.‘ఎంతో మంది యువబౌలర్లు నా వికెట్‌ తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. మార్చిమార్చి బంతులు వేసినా సరే.. క్రీజులో ఉన్నది గేల్‌ అన్న విషయం వాళ్లకు తెలుసు. నాకు బౌలింగ్‌ వేసే సమయంలో గేల్‌ అంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ను చూడలేదు అని వాళ్లు మనసులో అనుకుంటారు. కానీ, కెమెరా ముందు అడిగితే గేల్‌ అంటే భయం లేదని అంటారు. నిజానికి వాళ్ల మనసులో ఎంతోకొంత భయం ఉంటుంది. వాళ్లనే కెమెరా లేనప్పుడు అడిగితే.. అవును గేల్‌ ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌ అని ఒప్పుకొంటారు. ఫాస్ట్‌ బౌలర్ల బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎంతో ఎంజాయ్‌ చేస్తాను. అయితే, నా ఆట గురించి ఇంకా నిరూపించుకోవడానికి ఏం మిగల్లేదు. కేవలం నా అభిమానుల కోసమే ప్రపంచకప్‌ ఆడుతున్నా’ అని గేల్‌ అన్నాడు.





Untitled Document
Advertisements