యూకేలో 5జి సేవలు

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 05:41 PM

యూకేలో 5జి సేవలు

యూకే: యూకేలోని పలు ప్రాంతాల్లో అక్కడి ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క ఈఈ (EE) ఈ నెల 30నుండి 5జి సేవలను ప్రారంభిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మొదటగా లండన్‌, బ‌ర్మింగ్ హాం, కార్డిఫ్‌, మాంచెస్ట‌ర్‌, ఎడిన్‌బ‌ర్గ్‌, బెల్‌ఫాస్ట్ న‌గ‌రాల్లో 5జీ సేవ‌ల‌ను ఈఈ త‌న కస్ట‌మ‌ర్ల‌కు అందివ్వ‌నుంది. ఆ త‌రువాత నెమ్మ‌దిగా యూకేలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈఈ 5జీ సేవ‌ల‌ను అందివ్వ‌నుంది. ఈ క్ర‌మంలోనే 2019 చివ‌రి వ‌ర‌కు బ్రిస్ట‌ల్‌, కొవెంట్రీ, గ్లాస్గో, హ‌ల్‌, లీడ్స్‌, లీసెస్ట‌ర్‌, లివ‌ర్‌పూల్‌, న్యూకాజిల్‌, నాటింగ్‌హామ్‌, షెఫ్ఫీల్ట్‌ల‌లో 5జీ సేవ‌లు ల‌భిస్తాయ‌ని, ఆ త‌రువాత 2020 వ‌ర‌కు ఆబ‌ర్డీన్‌, కేంబ్రిడ్జి, డెర్బీ, గ్లూసెస్ట‌ర్‌, పీట‌ర్‌బ‌రో, ప్లైమౌత్‌, పోర్ట్స్ మౌత్‌, సౌతాంప్ట‌న్‌, వొర్సెస్ట‌ర్‌, వొల్వ‌ర్‌హాంప్ట‌న్ న‌గ‌రాల్లో ఈఈ నుంచి 5జీ సేవ‌లు ల‌భ్యం కానున్నాయి. ఇక 5జీ నెట్‌వ‌ర్క్ ద్వారా వినియోగ‌దారులు క‌నీసం 100150 ఎంబీపీఎస్ నుంచి గ‌రిష్టంగా 1 జీబీపీఎస్ వ‌ర‌కు ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే 2023 వ‌ర‌కు 3 ద‌శ‌ల్లో యూకే మొత్తం 5జీ సేవ‌ల‌ను అందిస్తామ‌ని ఈఈ తెలిపింది.





Untitled Document
Advertisements