ఒప్పొ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గింపు

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 05:48 PM

ఒప్పొ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గింపు

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తాజాగా తన నూతన రెండు స్మార్ట్‌ఫోన్లపై ధరలు తగ్గించింది. ఒప్పొ ఏ7, ఒప్పొ ఆర్17 ప్రో ఫోన్ల ధరలో కోత విధించింది. ఒప్పొ ఏ7 ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ వేరియంట్ దర రూ.1,000 తగ్గింది. ఈ ఫోన్ ధర ఇదివరకు రూ.14,990గా ఉండేది. ఇప్పుడు ఇది రూ.13,990కు అందుబాటులో ఉంది. ఇక ఒప్పొ ఆర్17 ప్రో ధర ఏకంగా రూ.10,000 దిగొచ్చింది. ఈ ధర తగ్గింపు ఇంకా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌‌‌లో కనిపించడం లేదు. ఒప్పొ ఆర్17 ప్రో ప్రారంభ ధర రూ.45,990. మార్చిలో దీని ధర రూ.6,000 దిగొచ్చింది. ఇప్పుడు తాజాగా మరో రూ.10,000 తగ్గింది. దీంతో ఇది రూ.29,990గా ఉంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 6.4 అంగుళాల ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, 25 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.





Untitled Document
Advertisements