పైకి కదలిన పసిడి ధర

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 07:05 PM

పైకి కదలిన పసిడి ధర

న్యూఢిల్లీ: దేశీ మార్కెట్‌లో జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం పసిడి ధర పైకి కదిలింది. దీంతో పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరుగుదలతో రూ.32,680కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.150 తగ్గుదలతో రూ.37,200కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 1,273.45 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.06 శాతం పెరుగుదలతో 14.41 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.32,680కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.32,510కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది.కేజీ వెండి ధర రూ.150 తగ్గుదలతో రూ.37,200కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.50 పెరుగుదలతో రూ.36,300కు ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,660కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,150కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.39,200 వద్ద స్థిరంగా కొనసాగింది.





Untitled Document
Advertisements