మెన్ ఇన్ బ్లూ భారత్ మాత్రమే....ఇంగ్లాండ్ జేర్సీలపై కామెంట్లు

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 07:12 PM

మెన్ ఇన్ బ్లూ భారత్ మాత్రమే....ఇంగ్లాండ్ జేర్సీలపై కామెంట్లు

ఇంగ్లాండ్: ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న ప్రపంచకప్ టోర్నీ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ జట్టు కోసం కొత్త కిట్‌ను సిద్ధం చేసింది. 1992 నాటి జెర్సీని తలపించేలా లైట్ బ్లూ కలర్‌లో కొత్త జెర్సీని రూపొందించింది. 1992 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ చేరింది. ఈసారి సొంత గడ్డ మీద హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న ఇంగ్లిష్ జట్టు.. తమకు కలర్ కూడా కలిసొస్తుందని భావిస్తోంది.అయితే ఈ జెర్సీపై నెటిజ‌న్లు జోకులు పేలుస్తున్నారు.కొత్త జెర్సీని గార్బేజీ బ్యాగ్‌లతో పోలుస్తున్నారు. వరల్డ్ కప్ 1990ల్లో జరిగితే సరిగ్గా నప్పేదని ఓ నెటిజన్ బదులిచ్చాడు. మెన్ ఇన్ బ్లూ భారత్ మాత్రమే అని ఇండియన్ ఫ్యాన్స్ ఈసీబీ ట్వీట్‌కు బదులిచ్చారు. ఇది ఇంగ్లాండ్ కిట్ కంటే ఇండియా కిట్‌గా అనిపిస్తోందని ఓ నెటిజన్ పంచ్‌లేశాడు.





Untitled Document
Advertisements