ఢిల్లీలో విపక్షాలు కీలక సమావేశం

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 07:55 AM

ఢిల్లీలో విపక్షాలు కీలక సమావేశం

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సందర్భంగా ఈరోజు ఉదయం నుంచే దేశ వ్యాప్తంగా హడావుడి నెలకొంది. తీవ్ర ఉత్కంఠ మధ్య నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దీంతో జాతీయ స్థాయిలో పార్టీ బలాబలాలను బట్టి విపక్ష పార్టీ నాయకుల అడుగులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హంగ్‌ ఏర్పడే పక్షంలో ఈరోజు సాయంత్రం ఢిల్లీలో విపక్షాలు కీలక సమావేశం కానున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే రంగం సిద్ధమైంది. యూపీఏతో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీలను ఈ భేటీకి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుంటే యూపీఏలోని ఆరు పక్షాలతోపాటు టీడీపీ, బహుజన సమాజ్‌ వాదీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక కూటమిగా ఏర్పడాలని ప్రతిపాదనలు కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా టీఆర్‌ఎస్‌, వైసీపీ నేతలను కూడా ఈ భేటీకి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా యోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. హంగ్‌ వస్తే తప్పకుండా అతి పెద్దగా కూటమిగా ఏర్పడి... ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ ఇవ్వాలని విపక్ష నేతలు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం వరకు వచ్చే ఫలితాలను బట్టి ఈ విపక్ష పార్టీలన్నీ ఓ అంచనా వేసుకొని అందుకు తగిన స్టెప్ తీసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఈరోజు కౌంటింగ్ డే కావడంతో ఏ క్షణంలో ఏదైనా జరగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.





Untitled Document
Advertisements