సినీ ప్రేక్షకులకు పండగే పండగ

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 09:45 AM

 సినీ ప్రేక్షకులకు పండగే పండగ

ఈ వారం లో సినీ ప్రేక్షకులకు పండగే పండగ ..ఏకంగా 9 సినిమా లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి .. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన “సీత”, అంజలి ప్రధాన పాత్రలో రూపొందిన “లీసా”, లగటిపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ లగడపాటి కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన “ఎవడు తక్కువ కాదు”, తమిళ అనువాద చిత్రం “నాగకన్య”, “నేను లేను” అనే చిన్న సినిమా విడుదలవుతున్నాయి. అలాగే.. హిందీ నుంచి “నరేంద్రమోడీ బయోపిక్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్” రిలీజవుతున్నాయి. ఇక హాలీవుడ్ నుంచి “ఆలాద్దీన్, బ్రైట్ బర్న్” సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ 9 సినిమాల్లో “సీత, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, ఆలాద్దీన్” చిత్రాల మీద జనాలకు మంచి అంచనాలున్నాయి. మరి ఈ 9 సినిమాలో ఏ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.





Untitled Document
Advertisements