310 స్థానాల్లో ఎన్ డిఎ లీడ్

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 10:10 AM

310 స్థానాల్లో ఎన్ డిఎ లీడ్

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్ డిఎ భారీ ఆధిక్యంలో దూసుకెళుతోంది. 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో 310 స్థానాల్లో ఎన్ డిఎ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 77 స్థానాల్లో యుపిఎ కూటమి ఆధిక్యంలో ఉంది. 69 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. పలువురు ప్రముఖులు వెనుకంజలో ఉన్నారు. యుపిలో ఎన్ డిఎ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో 80 లోక్ సభ స్థానాలు ఉండగా 56 స్థానాల్లో బిజెపి ముందంజలో ఉంది. ఎస్ పి, బిఎస్ పి కూటమికి చెందిన 16 మంది అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 2 స్థానాల్లోనే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. గుజరాత్ లో కూడా బిజెపి దూసుకెళుతోంది. ఈ రాష్ట్రంలో 26 స్థానాలు ఉన్నాయి. 22 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కర్నాటకలో బిజెపి ఆధిక్యంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 28 స్థానాల్లో 22 స్థానాల్లో బిజెపి ముందంజలో ఉంది. మధ్యప్రదేశ్ లో 20 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది.





Untitled Document
Advertisements