బిగ్ న్యూస్ : సాహోలో సల్మాన్ ఖాన్

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 10:15 AM

బిగ్ న్యూస్ : సాహోలో సల్మాన్ ఖాన్

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ సాహో. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన సుజిత్ సాహో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజైన సాహో పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. పోస్టర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా ఆగష్టు 15న ఫిక్స్ చేశారు.

ఇక ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఈ సినిమాలో బాలీవూడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని తెలుస్తుంది. సాహోలో సల్మాన్ ఖాన్ అదిరిపోయే ట్విస్ట్ కదా.. అయితే సల్మాన్ ఖాన్ ఓ కెమియో రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే చిత్రయూనిట్ సల్మాన్ ఖాన్ తో మాట్లాడారట.. ఆయన కూడా సరే అని చెప్పాడని టాక్. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతున్న సాహో సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడం ఆ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ తీసుకొస్తుంది. మరి ప్రభాస్, సల్మాన్ స్క్రీన్ షేరింగ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.





Untitled Document
Advertisements