నారాయణ మూర్తిపై చిరంజీవి ప్రశంసలు

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:06 AM

నారాయణ మూర్తిపై చిరంజీవి ప్రశంసలు

పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి నటిస్తూ డైరెక్ట్ చేసి నిర్మించిన సినిమా మార్కెట్ లో ప్రజాస్వామ్యం. ఈ సినిమా ఆడియో వేడుక ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. సినిమా ఆడియో ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం సైరా షూటింగ్ స్పాట్ కు వచ్చిన నారాయణ మూర్తి తన సినిమా ఆడియో రిలీజ్ కు రావాలని కోరాడు. మాది నాలుగు దశాబ్ధాల అనుబంధం.

ముందు ఫంక్షన్ కు నన్ను పిలవగానే ఆశ్చర్యానికి గురయ్యా.. ఆయన తరహాలో సినిమాలు చేస్తూ వెళ్లే నారాయణ మూర్తి ఆడియో ఫంక్షన్ కు తనని పిలవడంలో తన మీద అభిమానం తప్ప ఇంక ఏముంటుందని అనిపించింది. ఈ ఫంక్షన్ కు తాను రావడం ఆయనకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలియదు కాని నాకు చాలా సంతోషం ఇచ్చిందని అన్నారు చిరంజీవి.

నారాయణ మూర్తి అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ప్యూర్ హార్ట్ తో ఉన్నారు. సినిమాపై ఆయనకున్న ఇష్టమే ఆయన్ను ఈ స్థాయికి చేర్చిందని అన్నారు చిరంజీవి. పీపుల్స్ స్టార్ అని పిలిపించుకోవడం అనేది చిన్న విషయం కాదని.. కమర్షియల్ యాంగిల్ కాకుండా కమ్యునిజం.. అభ్యు దయ భావాలతో నటుడు, దర్శకుడు, నిర్మాతగా నారాయణ మూర్తి ముందుకెళ్తున్నారని అన్నారు. టెంపర్ సినిమాలో పోసాని పాత్రకు ఆయన్ను అడిగినా సరే కాదని చెప్పడం ఈ కాలంలో నారాయణ మూర్తికే చెల్లింది.

రెండు సినిమాలు కాగానే కారు, ఇళ్లు, బ్యాంక్ బ్యాలన్స్‌లు మెయింటైన్ చేస్తుంటారు. కాని మూర్తికి ఇవేం అవసరం లేదు.. సినిమాను ప్రేమించాడు.. సినిమానే పెళ్లి చేసుకున్నాడు.. సినిమానే తన బిడ్డలు అనుకున్నాడు.. సినిమాతోనే సంసారం చేస్తూ.. వ్యక్తిగతంగా ఏమీ లేకుండా ఓ యోగిలా మారాడని నారాయణ మూర్తిపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు.





Untitled Document
Advertisements