'సీత' లో రాముడి గురించి చెప్పరెంటి?

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:19 AM

'సీత' లో రాముడి గురించి చెప్పరెంటి?

తేజ దర్శకత్వంలో కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీత’. ఈ వారమే (మే24)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సినిమా క్రెడిట్ అంతా కాజల్ ఖాతాలో వేస్తున్నాడు తేజ. ఇది నా రామాయణం. నా సీత కథ అంటున్నారు. మహిళలకి బాగా నచ్చుతుంది. కాజల్ అద్భుతంగా నటించింది అంటున్నారు. వినల్ గా చేసిన సోనూసూద్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు తేజ్.

“ఈ సినిమాలో విలన్ పాత్రకి సోనూ సూద్ అయితే బాగుంటాడని భావించాను. మంచి కథలు రాకపోతుండటంతో తాను తెలుగు సినిమాలు తగ్గించినట్టు ఆయన చెప్పాడు. దాంతో నేను ఫోన్ లోనే కథను వినిపించాను. తనకు బాగా నచ్చడంతో ఓకే అన్నాడు. తన పాత్రను బాగా అర్థం చేసుకుని, అందుకు తగిన కాస్ట్యూమ్స్ కూడా ఆయనే తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోని పాత్ర ఆయనకి మంచి పేరు తీసుకురావడం ఖాయం” అంటున్నారు. ఐతే, బెల్లకొండ శ్రీనివాస్ పేరుని మాత్రం పెద్దగా వాడటం లేదు.





Untitled Document
Advertisements