వచ్చే నెల నుండి కొత్త సేవలు

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:55 AM

వచ్చే నెల నుండి కొత్త సేవలు

న్యూఢిల్లీ: ప్రముఖ విమాన సంస్థ ఎయిర్ ఇండియా వచ్చే నెల 1 నుండి కొత్త సేవలను ప్రారంభించేందుకు సిద్దమయ్యింది. వేసవి కాలంలో ప్రయాణికుల నుంచి వస్తున్న భారీ డిమాండ్ రావడంతో దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త విమాన సర్వీసులను అందిస్తున్నామని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో దేశీయంగా జూన్ 5 నుంచి భోపాల్-పుణే-భోపాల్ , వారణాసి-చెన్నై-వారణాసి మార్గాల్లో కొత్త విమానాలను సంస్థ నడపనుంది. దీంతోపాటు జూన్ 1 నుంచి దుబాయ్-ముంబై మార్గంలో వారానికి 3,500 సీట్లను ఆఫర్ చేయనున్నట్లు వెల్లడించింది. జూన్ 2 నుంచి ఢిల్లీ-దుబాయ్-ఢిల్లీ మార్గంలో 3,500 సీట్లను కూడా ఆఫర్ చేయనుంది. ఈ మార్గంలో రెండు డి787 డ్రీమ్ లైనర్లను నడపనుంది. జులై 31 వరకు ఢిల్లీ, ముంబై ఈ రెండు ప్రాంతాల నుంచి దుబాయ్‌కు వెళ్లేందుకు రూ.7,777 ఛార్జీ వసూలు చేయనుంది. దీంతోపాటు దేశీయ మార్గంలో ఎయిర్ ఇండియా భోపాల్-పుణే-భోపాల్ , వారణాసి-చెన్నై-వారణాసి మార్గంలో జూన్ 5 నుంచి విమానాలు నడపనుంది.

Untitled Document
Advertisements