అధార్ కార్డులో ఫోటో మార్చుకొండిలా...!

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:58 AM

అధార్ కార్డులో ఫోటో మార్చుకొండిలా...!

ప్రస్తుతం భారతదేశ ప్రతీ పౌరుడికి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైనదో తెలిసిందే. ప్రతీ ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యకలాపాలకు ఈ గుర్తింపు కార్డు కీలకమైనది. అయితే ఈ ఆధార్ కార్డుల్లో ఫోటోలు సరిగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆధార్‌లో మన ఫోటో మనకే నచ్చకపోవచ్చు. అయితే బాధపడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డులో ఫోటోను సులభంగానే మార్చుకోవచ్చు. రెండు మార్గాల్లో ఈ పని పూర్తి చేసుకోవచ్చు. దాని వివరాలు...మీరు మీ ఆధార్ కార్డులో ఫోటోను అప్‌డేట్ చేసుకోవాలంటే దగ్గరిలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఈ ఫామ్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లోని ఎగ్జిక్యూటివ్‌కు ఇవ్వాలి. అలాగే బయోమెట్రిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి ఎగ్జిక్యూటివ్ మీ ఫోటో తీసుకుంటారు. అప్‌డేట్ చేస్తారు. తర్వాత మీకు ఒక యూఆర్ఎన్ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దీని కోసం రూ.25 చెల్లించాలి. జీఎస్‌టీ అదనం.మీరు ఒకవేళ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లలేకపోతే.. యూఐడీఏఐ రీజినల్ ఆఫీస్‌కు లేఖ రాసి కూడా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఆధార్ డేటా అప్‌డేట్ కరెక్షన్ ఫామ్ డౌన్ చేసుకోవాలి. దీన్ని ఫిల్ చేయాలి. ఒక లెటర్ రాసి, దీనికి ఫామ్ జతచేసి యూఐడీఏఐ రీజినల్ ఆఫీస్‌కు పంపాలి. ఫోటో కాపీ కూడా జతచేయాలి. మీ ఇంటికే 15 నుంచి 20 రోజుల్లో కొత్త ఆధార్ కార్డు వస్తుంది.





Untitled Document
Advertisements