నష్టాల నుంచి కోలుకుంటున్న బ్యాంక్ ఆఫ్ బరోడా

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:59 AM

నష్టాల నుంచి కోలుకుంటున్న బ్యాంక్ ఆఫ్ బరోడా

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ప్రముఖ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా 2018-19 క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో కొంతమేరకు నష్టాల నుంచి కోలుకుంది. మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ నికర నష్టం రూ.990 కోట్లుగా నమోదైంది. అయితే గతేడాది ఇదే సమయంలో బ్యాంక్ నష్టం రూ.3,102 కోట్లతో పోలిస్తే ఈసారి తగ్గుముఖం పట్టింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి స్టాండలోన్, కన్సాలిడేటెడ్ లాభం వరుసగా రూ.433 కోట్లు, రూ.1,100 కోట్లుగా నమోదైంది. అలాగే స్టాండలోన్, కన్సాలిడేటెడ్ నష్టాలు రూ.2,431 కోట్లు, రూ.1,887 కోట్లు నమోదయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.12,735 కోట్ల నుంచి రూ. 15,284 కోట్లకు పెరిగింది. మొత్తం సంవత్సరానికి స్టాండలోన్ ఆదాయం రూ.56,065 కోట్లతో 11.4 శాతం పెరగ్గా, కన్సాలిడేటెడ్ ఆధారంగా ఇది రూ.60,793 కోట్లతో 12.5 శాతం పెరిగింది. ఆస్తులను పరిశీలిస్తే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఎలు) 9.61 శాతం తగ్గాయి. గతేడాది 2018 సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో ఎన్‌పిఎలు 12.26 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పిఎలు 5.49 శాతం నుంచి 3.33 శాతానికి తగ్గాయి. ఎన్‌పిఎలు రూ.15,609 కోట్ల నుంచి రూ.3,521 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలకు దాదాపు రూ.5,550 కోట్లను బ్యాంక్ కేటాయించింది. గతేడాది ఈ కేటాయింపులు రూ.7,052 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.10,18,747 కోట్ల నుంచి రూ.11,07,509 కోట్లతో 8.71 శాతం పెరిగింది. బుధవారం మార్కెట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 0.68 శాతం పెరిగి రూ.126.20 వద్ద ముగిసింది.

Untitled Document
Advertisements