ఇరాన్‌పై ట్రంప్ పాలన యంత్రాంగం ఆగ్రహం

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:12 PM

ఇరాన్‌పై  ట్రంప్ పాలన యంత్రాంగం ఆగ్రహం

వాషింగ్టన్: ఇరాన్‌పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. గల్ఫ్ చమురు ప్రయోజనాలు దెబ్బతీసే దాడుల వెనక ఇరాన్ ఉండే అవకాశం ఉందని ఆరోపించింది. అమెరికన్ కాంగ్రెస్‌కు ట్రంప్ అధికారులు ఇచ్చిన వివరణల్లో ఇరాన్‌ను విమర్శించినా కొన్ని వారాల ముందున్న తీవ్రత కనిపించలేదు. కానీ ప్రతిపక్ష డెమొక్రాట్లు మాత్రం అమెరికాను యుద్ధం వైపు నడిపిస్తోందని విమర్శించారు. విదేశాంగ మంత్రి మైక్ పోంపియో మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలో క్రూడ్ పైప్‌లైన్‌పై డ్రోన్ లతో దాడులు కానీ, అరబ్ ఎమిరేట్స్ చమురు ప్రయోజనాలు దెబ్బతినేలా ఇరాన్ వ్యవహరించిందని కానీ కచ్చితంగా చెప్పలేం. అయితే అక్కడ ప్రాంతీయ విభేధాలను గత పదేళ్లుగా చూస్తున్నాం. దాడుల తీరును చూస్తుంటే ఇరాన్ హస్తం ఉండవచ్చని అనిపిస్తోంది. అయితే అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. దాంతో ఇరాన్ దూకుడుకు కళ్లెం వేయవచ్చు. ఇరాన్ వల్లే క్రూడ్ ధరలు పెరిగే పరిస్థితి ఏర్పడింది’ అని వివరించారు.





Untitled Document
Advertisements