#SSMB26: మహేశ్ - అనిల్ రావిపూడి సినిమాకి ముహూర్తం ఫిక్స్

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:18 PM

#SSMB26: మహేశ్ - అనిల్ రావిపూడి సినిమాకి ముహూర్తం ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి హిట్ కిక్కులో ఉన్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ దాదాపు ముగిసినట్టే. దాంతో మహేష్ తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ 26 తెరకెక్కనుంది. ఇందులో మహేష్ కి జంటగ రష్మికమందన జతకట్టనున్నారు. సీనియర్ హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తారు.

ఈ సినిమా పూజ కార్యక్రమాలు మే 31వ తేదీన జరిపి, రెగ్యులర్ షూటింగ్ జూన్ 26 వ తేదీ నుంచి చేయబోతున్నట్టు తెలిసింది. ఈ చిత్రం కోసం సరిలేరు నీకెవ్వరు, వాట్సాప్, రెడ్డిగారి అబ్బాయి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఒక టైటిల్ ఫైనల్ కానుంది. ఇందులో మహేష్ సైనికుని పాత్రలో కనిపిస్తారని సమాచారమ్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.





Untitled Document
Advertisements