తారక్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తోనే

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:27 PM

తారక్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తోనే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాని ఓకే చేస్తున్నారు. టెంపర్ నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్నారు. 2020 జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాతి తారక్-త్రివిక్రమ్ మరోసారి జతకట్టబోతున్నట్టు సమాచారమ్.

వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అరవింద సమేత’ మంచి విజయాన్ని అందుకొంది. ఫ్యాక్షన్ కథల్లోనే కొత్త యాంగిల్ ని ట్రై చేశారు. ఇటీవల తారక్ బర్త్ డే సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులతో పిచ్చాపాటిగా మాట్లారట. ఈ సందర్భంలో తారక్ తదుపరి సినిమాపై చర్చకు వచ్చిందట. తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని తారక్ చెప్పినట్టు అభిమానులు చెప్పుకొంటున్నారు. ఐతే, ఈ సారి తారక్ తో కలిసి త్రివిక్రమ్ ప్రయోగం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.





Untitled Document
Advertisements