ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:43 PM

 ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్

ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమైంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ 150 సీట్లలో లీడ్‌లో ఉంది. టీడీపీ 24 సీట్లకే పరిమితమయింది. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాబోయే సీఎం జగన్‌ను కలిసి అభినందించారు. ఇక.. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 25న వైఎస్సార్సీపీ శాసనసభాపక్షసమావేశం జరగనుంది. నిజానికి ఈ నెల 26 తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ ముహూర్తం బాగుండటంతో జగన్ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయడానికి విరమించుకుని మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నారని సమాచారం. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచనల మేరకే జగన్ తన ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా ఇలాంటి అంశాల్లో ఎక్కువగా స్వరూపానంద సూచనలు పాటిస్తున్న వైసీపీ అధినేత. ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తం విషయంలోనూ ఆయన సలహానే పాటించారని అందుకే ముందుగా అనుకున్న ముహూర్తాన్ని కాదని కొద్ది రోజులు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.





Untitled Document
Advertisements