ప్రభాస్ 'సాహో' నుండి వారనికో అప్ డేట్

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:53 PM

 ప్రభాస్ 'సాహో' నుండి వారనికో అప్ డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్. సాహో టైం మొదలైంది. ఇకపై సాహో నుంచి పోస్టర్లు, టీజర్, మేకింగ్ వీడియోలు క్యూ కట్టబోతున్నాయ్. మంగళవారం రిలీజ్ డేటుని తెలుపుతూ సాహో కొత్త పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న సాహో రిలీజ్ డేటుని ఖరారు చేసారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకి ఇంకా ఏడు వారాలు మాత్రమే ఉంది. దీంతో వారనికో అప్ డేట్ రాబోతుంది.

అంతేకాదు.. ఇటీవల ప్రభాస్, హీరోయిన్ శ్రద్దాకపూర్ పై స్పెషల్ ఫోటో షూట్ నిర్వహించారు. దానికి సంబంధించిన రెండు పోస్టర్లు త్వరలోనే రాబోతున్నాయి. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు అదనం. రెండు వారాలు ఆగితే పాటలు రాబోతున్నాయి. ప్రీ-రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నారు. మొత్తానికి సాహో పండగ మొదలైపోయింది.





Untitled Document
Advertisements