ఫలితాలకు ముందే స్టాక్‌మార్కెట్ల ఒడిదుడుకులు

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:09 PM

ఫలితాలకు ముందే స్టాక్‌మార్కెట్ల ఒడిదుడుకులు

ముంబై: నేడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలు వెలువడడానికి ముందు దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను లోనయ్యాయి. బుధవారం మార్కెట్లు స్వల్పలాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 39,087 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,735 వద్ద ముగిసింది. ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనుండడంతో ఇన్నెస్టర్లు జాగ్రత్త వహించారు. మార్కెట్లలో ట్రేడింగ్ ఆచీతూచీ వ్యవహరించారు. ప్రధాన స్టాక్స్ ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్‌టెల్‌లు లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ లాభాల్లో ముగియగా, నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి సూచీలు పతనమయ్యాయి. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు 18 శాతం నష్టపోయాయి. జెట్ ఎయిర్‌వేస్ షేర్లు వరుసగా మూడో రోజు కూడా లాభపడ్డాయి.





Untitled Document
Advertisements