బ్రిటీష్‌ స్టీల్‌ లిమిటెడ్‌ మూసివేత

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:10 PM

బ్రిటీష్‌ స్టీల్‌ లిమిటెడ్‌ మూసివేత

లండన్‌: బ్రిటీష్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సంస్థను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో దీన్ని రక్షించేందుకు చేసిన ఆఖరి ప్రయత్నాలూ ఫలించలేదు. దీంతో ఈ సంస్థ మూతబడింది. యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో లండన్‌ హైకోర్టు.. సంస్థ ఆస్తులను అమ్మేయాల్సిందేనని స్పష్టం చేసింది. తద్వారా వచ్చిన సొమ్ముతో అప్పులను తీర్చాలని సూచించింది. ఈ క్రమంలో బుధవారం బ్రిటీష్‌ స్టీల్‌ బందైంది. దీంతో సంస్థలో పనిచేస్తున్న 5 వేల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది. పరోక్షంగా మరో 20 వేల మంది ఉద్యోగాలూ ప్రమాదంలో పడ్డాయి. ‘బ్రిటీష్‌ స్టీల్‌, దాని యజమాని గ్రేబుల్‌ క్యాపిటల్‌తోపాటు రుణదాతలతో సంస్థ పునరుద్ధరణ కోసం నిర్విరామంగా చర్చలు జరిపాం. అయినా ఫలితం శూన్యం’ అని బ్రిటన్‌ వాణిజ్య మంత్రి గ్రెగ్‌ క్లార్క్‌ తెలిపారు. ఇప్పటికే ఆ సంస్థను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో 152 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్నీ చేశామని, అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు.





Untitled Document
Advertisements