'యూరో టీ20 స్లామ్‌' టీ20 ఐకానిక్ ప్లేయర్‌గా అఫ్రిది

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:11 PM

'యూరో టీ20 స్లామ్‌' టీ20 ఐకానిక్ ప్లేయర్‌గా అఫ్రిది

హైదరాబాద్: పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది 'యూరో టీ20 స్లామ్‌' టీ20 టోర్నమెంట్‌కు ఐకానిక్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో జరగనున్న ఈ టీ20 టోర్నీని క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్‌లాండ్, నెదర్లాండ్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ సరికొత్త టీ20 టోర్నమెంట్‌లో ఈ మూడు దేశాలకు చెందిన ఆరు జట్లు పాల్గొంటాయి. హాలెండ్ నుంచి అమస్టర్‌డామ్ కింగ్స్, రోట్టర్‌డామ్ రైనోస్... స్కాట్లాండ్ నుంచి గ్లాస్కో జెయింట్స్, ఎడిన్‌బర్గ్ రాక్స్.... ఐర్లాండ్ నుంచి బెల్‌ఫెస్ట్ టైటాన్స్, డబ్లిన్ ఛీప్స్ జట్లుగా ఏర్పడ్డాయి.ఆగస్టు 30 నుంచి ఆరంభమయ్యే ఈ టోర్నీలో దక్షిణాప్రికాకు చెందిన జెపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్‌లు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. టోర్నీలోని ప్రతి ఒక్క జట్టూ మిగతా ఐదు జట్లతో తలపడనుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.కాగా, పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిదిని ఈ టోర్నీకి ఐకానిక్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌లో పదకొండు వేలకు పైగా పరుగులు 540 వికెట్లు పడగొట్టాడు. అఫ్రిదితో పాటు ఆస్ట్రేలియా నుంచి షేన్ వార్న్, న్యూజిలాండ్ నుంచి బ్రెండన్ మెక్‌కల్లమ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రషీద్ ఖాన్‌లు ఐకానిక్ ప్లేయర్లుగా ఉన్నారు.జేపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ లిన్, న్యూజిలాండ్‌కు చెందిన లూక్ రోంచీ, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజామ్‌లు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. అఫ్రిది ఇప్పటివరకు 303 టీ20లాడి 333 వికెట్లు తీశాడు. 2009లో పాకిస్థాన్ టీ20 వరల్డ్‌కప్ నెగ్గిన జట్టులో అఫ్రిది కీలకంగా వ్యవహారించాడు.





Untitled Document
Advertisements