గోవా ఉపఎన్నికల్లో గెలుపొందిన మనోహర్ పారికర్

     Written by : smtv Desk | Mon, Aug 28, 2017, 02:32 PM

గోవా ఉపఎన్నికల్లో గెలుపొందిన మనోహర్ పారికర్

పనాజి, ఆగస్టు 28 : పనాజీ శాసనసభ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ విజయం సాధించారు. ఐదు ఏళ్ల క్రితం రక్షణ మంత్రిగా రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మనోహర్ పారికర్, కాంగ్రెస్ అభ్యర్థి గిరీస్ చోదంకర్ పై 4803 అధిక్యతతో విజయం సాధించారు. పారికర్ కు 9862 ఓట్లు రాగ కాంగ్రెస్ అభ్యర్థికి చోదంకర్ కు 5059 ఓట్లు లభించాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన గోవా సురష్మాజ్ అధ్యక్షుడు ఆనంద్ సురోర్కార్ నోట హక్కు లభించినా 301 ఓటు కన్నా తక్కువగా 220 ఓట్లు మాత్రమే లభించాయి. శాసనసభ్యుడిగా ఎన్నిక కాకుండానే గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పారికర్ కోసం అంతకుముందు పనాజీ నుంచి గెలిచిన సిధార్ద్ రాజీనామా చేశారు. ఈ ఉపఎన్నికల్లో గెలిచిన పారికర్, వచ్చే వారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గోవాలో మరో స్థానం వాల్ పైకి జరిగిన ఉపఎన్నికల్లోనూ మరోసారి భాజపా గెలిచింది. అక్కడి నుంచి పోటీ చేసిన అభ్యర్థి విస్వాజిత్ రాణే 10066 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.





Untitled Document
Advertisements