24 సార్లు ఎవరెస్ట్ అధిరోహించిన షెర్పా గైడ్

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:16 PM

24 సార్లు ఎవరెస్ట్ అధిరోహించిన  షెర్పా గైడ్

కాఠ్మాండూ: ఎవరెస్ట్ పర్వతాన్ని 24వ సారి అధిరోహించి నేపాలీ షెర్పా గైడ్ కామి రీటా వారం వ్యవధిలోనే తన పాత రికార్డును బద్దలుకొట్టారు. ఈ నెల 15న 23వ సారి ఎవరెస్ట్‌ను ఎక్కి, ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మంగళవారం భారత పోలీస్ బృందానికి గైడ్‌గా వ్యవహరించి 24వసారి అధిరోహించి రికార్డు బద్దలు కొట్టారు. 1994 నుంచి కామి రీటా ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నారు.





Untitled Document
Advertisements