మోదీ లక్ష 12 వేలు.... అమిత్‌షా లక్షా 77 వేల అధిక్యం

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 01:37 PM

మోదీ లక్ష 12 వేలు.... అమిత్‌షా లక్షా 77 వేల అధిక్యం

ధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నువ్వా-నేనా అనే రీతిలో ఓట్ల ఆధిక్యత పరంగా దూసుకుపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్‌ ఆధారంగా ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి లక్షా 12 వేల 476 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి లక్షా 77 వేల 350 ఓట్ల ఆధిక్యంతో సత్తా చాటుతున్నారు.

ప్రధాని మోదీతో వారణాసి నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్ బాగా వెనుకబడ్డారు. గాంధీనగర్ నుంచి అమిత్‌షాకు పోటీదారులుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సీజే చావ్డా, బీఎస్‌పీ అభ్యర్థి జయేంద్ర రాథోడ్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మోదీ రెండోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.

2014లో ఆయనపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. 3.37 లక్షల ఓట్ల ఆధిక్యంతో మోదీ అప్పట్లో గెలిచారు. ఇక, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమిత్‌షా తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీకి దిగారు. గత ఎన్నికల్లో గాంధీనగర్ నియోజవర్గం నుంచి బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ గెలుపొంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.





Untitled Document
Advertisements