నంద్యాల ఎమ్మెల్యేకు ప్రధాని మోదీ అభినందనలు

     Written by : smtv Desk | Mon, Aug 28, 2017, 04:13 PM

నంద్యాల ఎమ్మెల్యేకు ప్రధాని మోదీ అభినందనలు

న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: నంద్యాల నూతన ఎమ్మెల్యేకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన భూమా బ్రహ్మనంద రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. 'ఎన్డీయేకు ఎంతో విలువైన మ‌ద్దతుదారు టీడీపీ త‌ర‌ఫున‌ నంద్యాలలో ఘ‌న‌విజ‌యం సాధించినందుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి గారికి నా శుభాకాంక్షలు' అంటూ ప్ర‌ధాని పేర్కొన్నారు. కాగా, ఈ ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27,466 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements