నన్ను మోదీ భక్తుడిలా చూస్తున్నారు

     Written by : smtv Desk | Fri, May 24, 2019, 06:01 PM

నన్ను మోదీ భక్తుడిలా చూస్తున్నారు

ప్రధాన మంత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ శుక్రవారం విడుదల అయింది. ఈ సినిమాలో నరేంద్రమోదీ పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్ ఈ సందర్భంగా స్పందించారు. తనను కొంత మంది మోదీ భక్తుడిగా చూస్తున్నారని.. కానీ నేను ఎవరికీ భక్తుడిని కాదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తాను దేశ భక్తుడిని అంటూ ప్రత్యర్థులకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కాగా.. ‘పీఎం నరేంద్రమోదీ’ చిత్రం విడుదల సందర్భంగా వివేక్ ఒబెరాయ్, సినిమా నిర్మాత సురేశ్ ఒబెరాయ్ ముంబయ్ లోని ఓ థియేటర్ వద్ద ప్రేక్షలకు చాయ్‌ని అందించారు. మొదటగా ఈ సినిమాని ఏప్రిల్ 11న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements