కోహ్లీ మనిషి కాదు...ఓ పరుగుల మెషీన్: బ్రియాన్ లారా

     Written by : smtv Desk | Fri, May 24, 2019, 07:07 PM

కోహ్లీ మనిషి కాదు...ఓ పరుగుల మెషీన్: బ్రియాన్ లారా

టీంఇండియా కాప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా బ్రియాన్ లారా ఓ మీడియాతో మాట్లాడుతూ...'అతను ఓ పరుగుల మెషీన్. 80-90లో కంటే కోహ్లీ ప్రత్యేకమైన ఆటగాడు. ప్రస్తుతం నిరంతరం క్రికెట్ ఆడుతున్న కారణంగా ఫిట్ నెస్ చాలా అవసరం. కోహ్లీ ఇందులో ముందున్నాడు. మైదానంలోకి వచ్చిన ప్రతిసారి పరుగులు చేస్తున్నాడు. సచిన్ ఎప్పటికీ గొప్ప బ్యాట్స్‌మన్‌. సచిన్, కోహ్లీలను పోల్చలేను. కానీ.. కోహ్లీకి ప్రత్యేక టాలెంట్ ఉంది. అతను రాబోయే క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తాడు' అని లారా పేర్కొన్నారు.'ఒకవేళ బుమ్రాను నేను ఎదుర్కొవాల్సి వస్తే.. స్ట్రైక్ రాకుండా చూసుకుంటాను. లేదా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతనిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తా. బుమ్రా బౌలింగ్ శైలి కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అతను భారత బెస్ట్ బౌలర్. ఈ ప్రపంచకప్‌లో బ్యాట్స్‌మన్‌లు అతనిపై ఓ కన్నేసి ఉంచండి' అని లారా సూచించారు.భారత జట్టు మంచి సమతూకంతో ఉంది. అన్ని పరిస్థితుల్లోనూ రాణించగల సామర్థ్యం భారత జట్టుకు ఉంది. భారత జట్టు చాలా బలంగా ఉంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇక సొంత గడ్డపై ఇంగ్లండ్ కూడా ప్రమాదమే. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ జట్టు అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకోలేదు.. ఈ సారి ఆ జట్టు కల సాకారమవుతుందో? లేదో? చూడాలి' అని లారా పేర్కొన్నారు.

Untitled Document
Advertisements