ప్రధాని పదవికి రాజీనామా!

     Written by : smtv Desk | Fri, May 24, 2019, 07:09 PM

ప్రధాని పదవికి రాజీనామా!

బ్రిటిష్ ప్రధాని థెరెసా మే తాజాగా తన పదివికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతిచ్చేలా ఎంపీలను ఒప్పించలేనందుకు కన్జర్వేటివ్ పార్టీ నేతగా జూన్ 7న రాజీనామా చేయనున్నట్టు మే తెలిపారు. తన డౌనింగ్ స్ట్రీట్ నివాసం బయట పూడుకుపోతున్న గొంతుతో 'బ్రెగ్జిట్ ను సజావుగా అమలు చేయలేకపోవడం నాకు ఎప్పటికీ విచారకరంగా ఉంటుందని' మే అన్నారు.థెరెసా మే రాజీనామాతో నాయకత్వ బాధ్యతలకు మరోసారి అధికారికంగా పోటీ ప్రారంభం కానుంది. ఈ సమయంలో మే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 'జూన్ 7 శుక్రవారం నేను కన్జర్వేటివ్ అండ్ యూనియనిస్ట్ పార్టీ నాయకురాలిగా రాజీనామా చేస్తానని' మే చెప్పారు. 'ఆ తర్వాత వారంలో కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందని' ఆమె తెలిపారు. ఈ నాయకత్వ రేసుకు పలు వారాల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.





Untitled Document
Advertisements