ఇంగ్లాండ్‌ జట్టుకు షాక్‌

     Written by : smtv Desk | Fri, May 24, 2019, 08:03 PM

ఇంగ్లాండ్‌ జట్టుకు షాక్‌

లండన్‌: ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌ జట్టుకు పెద్ద షాక్‌ ఎదురైంది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ గాయపడటం ఆ జట్టును కలవరపెడుతోంది. శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో క్యాచింగ్‌ డ్రిల్స్‌ చేస్తుండగా మోర్గాన్‌ గాయపడ్డాడని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవాళ ఉదయం ఫీల్డింగ్‌ సాధన చేస్తుండగా ఎడమచేతి వేలికి గాయమైంది. వెంటనే ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఎక్స్‌-రే తీయించాం. అని ఈసీబీ వెల్లడించింది. సన్నాహక మ్యాచ్‌ల్లో భాగంగా శనివారం సౌతంప్టన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ మే 30న సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పాల్గొననుంది.





Untitled Document
Advertisements