హాజీపూర్ గ్రామంలో కట్టు దిట్టమైన నిఘా.. సీసీ కెమెరాలు అమలు

     Written by : smtv Desk | Sat, May 25, 2019, 04:31 PM

హాజీపూర్ గ్రామంలో కట్టు దిట్టమైన నిఘా.. సీసీ కెమెరాలు అమలు

సీసీ కెమెరాలు నేర పరిశోధనలో పోలీసులకు ఎంతో సాయం చేస్తున్నాయి. అందుకే.. రాజధాని హైదరాబాద్ లో విరివిగా సీసీ కెమెరాలను అమర్చారు పోలీసులు. క్రమంగా వీటిని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం.. హాజీపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బొమ్మల రామారం మండలం.. హాజీపూర్ గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచింది. సైకో శ్రీనివాస్ రెడ్డి.. ముగ్గురు బాలికలను హతమార్చి పాడుబడిన బావిలో వారి శవాలను పూడ్చిపెట్టిన ఆనవాళ్లు బయటపడటం సంచలనం రేపింది. నేరాలను అదుపుచేయడానికి కృషి చేస్తామని చెప్పిన పోలీసులు.. ప్రతి గ్రామంలోనూ టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. అందులో భాగంగా.. హాజీపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చారు.





Untitled Document
Advertisements