ఒక్కడే...ఒకే ఓవర్లో ఆరు సిక్షులు

     Written by : smtv Desk | Sat, May 25, 2019, 06:29 PM

ఒక్కడే...ఒకే ఓవర్లో ఆరు సిక్షులు

ఐసిసి వరల్డ్ కప్ చరిత్రలో ఒకే ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్షులు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మన్ హర్ష్‌లే గిబ్స్‌. ఈ అరుదైన రికార్డుకి 2007 వన్డే వరల్డ్‌కప్ వేదికైంది. దక్షిణాఫ్రికాకు చెందిన గిబ్స్ విధ్వంసానికి బలైంది మాత్రం పసికూన నెదర్లాండ్స్‌.వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ఆరంభం కావడంతో ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిబ్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులోకి వచ్చిన మొదట్లో నెమ్మదిగా ఆడిన గిబ్స్ నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్‌ వాన్‌ బుంగె వేసిన ఇన్నింగ్స్‌ 30వ ఓవర్లో చెలరేగాడు.వరుసగా 6, 6, 6, 6, 6, 6 సిక్సర్లతో చెలరేగాడు. లాంగాన్‌లో తన తొలి సిక్స్‌ బాదిన గిబ్స్‌ ఆ తర్వాత బుంగెకు చుక్కలు చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొదట 3 వికెట్లకు 353 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. 221 పరుగుల తేడాతో విజయం సాధించింది.





Untitled Document
Advertisements