ఆర్థిక సంవత్సరంగా 'ఏప్రిల్ - మార్చి' నే ఖరారు చేసిన మోదీ

     Written by : smtv Desk | Tue, Aug 29, 2017, 12:44 PM

ఆర్థిక సంవత్సరంగా 'ఏప్రిల్ - మార్చి' నే ఖరారు చేసిన మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 29 : భారత దేశ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - మార్చి ఆర్థిక చక్రాన్ని జనవరి- డిసెంబర్ కు మార్చాలని గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఆ ఆలోచనను విరమించుకుంది. ప్రధాని మోదీ ఆలోచనలకు పలు రాష్ట్రాలు సహకరించకపోవడంతో కేంద్రం ఈ విషయాన్ని చర్చలను పక్కన పెట్టిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఫైనాన్షియల్ సైకిల్ ను మార్చితే ప్రయోజనాలు ఉండవని ఆర్థిక నిపుణులు స్పష్టం చేయడంతో మోదీ కూడా ఈ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. అలాగే మొదటి నుంచి బ్రిటిష్ పాలన భారత్ పై అలవాటుగా మారుతుండడంతో వాటిని ఒక్కొక్కటిగా వదిలించుకోవాలన్నది తన ఆలోచనని నరేంద్ర మోదీ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇవి అన్ని కూడా జరగాలంటే పలు రాష్ట్రాల సహకారం పలకాల్సి ఉంటుంది. ఈ మేరకు 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఈ విషయంపై మరోసారి భేటీ అవ్వనున్నట్లు కేంద్రం నిర్ణయించుకుందని అధికారి వెల్లడించారు.

Untitled Document
Advertisements