డేరా బాబా శిక్షపై భారత క్రికెటర్ స్పందన

     Written by : smtv Desk | Tue, Aug 29, 2017, 01:06 PM

డేరా బాబా  శిక్షపై భారత క్రికెటర్ స్పందన

న్యూఢిల్లీ, ఆగస్టు 29 : సుప్రీంకోర్టు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు ఆత్యాచార కేసులో 20 సంవత్సరాల శిక్షను విధిస్తూ, సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ ఇచ్చిన తీర్పును ఎంతో మంది ఆనందంతో స్వాగతించారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఈ తీర్పును మహిళల విజయంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్సీఆర్బీ 2015 గణాంకాల ప్రకారం, దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 1,37,458 మిగితా రేప్ కేసుల విచారణ సాగుతోందని గుర్తు చేశారు. ఆ కేసుల విచారణ కూడా పరిష్కరించాలని అయన అన్నారు. ఇందుకోసం న్యాయస్థానాలు కృషి చేయాలంటూ సూచించారు. 2002లో నమోదైన రేప్ కేసుల్లో గుర్మీత్ కు సుప్రీంకోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

Untitled Document
Advertisements