హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములపై నిషేధ పక్రియ మొదలు

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 01:36 PM

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములపై నిషేధ పక్రియ మొదలు

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వం తాజాగా హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములను పని అనుమతిపై నిషేధం విధించే ప్రక్రియ ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిని తొలగించేలా ట్రంప్‌ సర్కార్‌ గతంలో ప్రతిపాదనలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనలపై ఇటీవల నోటీసులు జారీ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ రెండో దశకు చేరుకుందట. ఇక్కడ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే.. వాటిని ఫెడరల్‌ రిజిస్ట్రీలో ప్రచురిస్తారు. ఆ తర్వాత కొత్త ప్రతిపాదనలపై 3060 రోజుల వరకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు వీలుంటుంది. అనంతరం దీనిపై చట్టం తీసుకొస్తారు. అయితే ఇదంతా జరిగేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements