నేడు ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 04:01 PM

నేడు ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియెట్ పరీక్షలలో ఫెయిల్ అయిన 3,82,116 మంది విద్యార్దుల పరీక్షాపత్రాలను ప్రభుత్వాదేశం మేరకు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేసిన తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు నేడు వాటి ఫలితాలను ప్రకటించబోతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు రీవెరిఫికేషన్ చేసిన పరీక్షాపత్రాలను కూడా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబోతోంది. వాస్తవానికి ఈనెల 21నే ఫలితాలు వెల్లడించడానికి ఇంటర్ బోర్డు సిద్దపడినప్పటికీ, ఫలితాలతోపాటు విద్యార్దుల జవాబుపత్రాలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచాలని హైకోర్టు ఆదేశించడంతో ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. మరికొద్ది సేపటిలో ఫలితాలు ప్రకటించవచ్చునని సమాచారం.

ఒకవేళ ఈసారి భారీ సంఖ్యలో విద్యార్దులు ఉత్తీర్ణులైనట్లయితే, ఇంతకు ముందు మూల్యాంఖనం చేసినప్పుడు ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతుంది. ఈసారి మూల్యాంకనం చేసిన జవాబుపత్రాలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచబోతోంది కనుక ఒకవేళ ఈసారి తక్కుమంది లేదా అసలు ఎవరూ ఉత్తీర్ణులుకాకపోయినా విద్యార్దులు, వారి తల్లితండ్రులు ఇంటర్ బోర్డును తప్పుపట్టలేరు.

ఈ ఏడాది ఇంటర్ ఫలితాలలో ఎదురైన చేదు అనుభవాలను ఇంటర్ బోర్డు ఒక గుణపాఠంగా భావించి మళ్ళీ వచ్చే ఏడాది ఇటువంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకొంటే మంచిది. అలాగే త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేస్తే మంచిది.





Untitled Document
Advertisements