వివో జడ్5ఎక్స్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 04:30 PM

వివో జడ్5ఎక్స్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ వివో జడ్5ఎక్స్ పేరుతో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వివో జడ్5ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు మెమరీ, 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, పంచ్ హోల్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా (16 ఎంపీ+8 ఎంపీ+ 2 ఎంపీ), 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి. పంచ్ హోల్ డిస్‌ప్లే ఫీచర్లతో హానర్, శాంసంగ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఫోన్లు లాంచ్ చేశాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్‌లో వివో ఇ-స్టోర్, టీమాల్.కామ్, సనింగ్.కామ్ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులో ఉండనుంది. ఇకపోతే ఈ ఫోన్లు ఎప్పుడు ఇండియన్ మార్కెట్‌లోకి వస్తాయో తెలియదు. ఫోన్ ధర దాదాపు రూ.14,000 నుంచి ప్రారంభమౌతోంది. 4 జీబీ ర్యామ్+64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. 6 జీబీ ర్యామ్+64 జీబీ మెమరీ ధర దాదాపు రూ.15,000గా ఉంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ ధర దాదాపు రూ.17,000గా, 8 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్ ధర దాదాపు రూ.20,000గా ఉంది.





Untitled Document
Advertisements