స్పైస్‌జెట్‌లోకి బోయింగ్ 737 విమానం

     Written by : smtv Desk | Mon, May 27, 2019, 05:35 PM

స్పైస్‌జెట్‌లోకి బోయింగ్ 737 విమానం

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌లోకి మరో బోయింగ్ 737 విమానం వచ్చి చేరింది. దీంతో స్పైస్‌జెట్‌లో మొత్తం విమానాల సంఖ్య 100కు చేరింది. దేశీయ ప్రభుత్వరంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియా, సేవలను నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో సంస్థల తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న నాలుగో సంస్థ స్పైస్‌జెట్ కావడం విశేషం. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఎయిర్‌ఆసియా, అలయెన్స్ వంటి ఎనిమిది దేశీయ విమాన సంస్థలు కలిపి మొత్తంగా 595 విమానాలను కలిగి ఉన్నాయి. గత ఒక్క నెలలోనే 23 విమానాలను ప్రవేశపెట్టినట్టు స్పైస్‌జెట్ ప్రకటించింది. 100 విమానాల మైలురాయిని చేరిన సందర్భంగా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ స్పందించారు. ‘2014 డిసెంబర్‌లో మూతపడనుందని భావించారు, అయితే 2019లో స్పైస్‌జెట్ 100 విమానాల స్థాయికి చేరుకుంది’ అని ఆయన అన్నారు. గురుగ్రామ్‌కు చెందిన సంస్థ 68 బోయింగ్ 737 విమానాలు, 30 బాంబార్డియర్ క్యూ400లు, రెండు బి737 ఫ్రైటర్లు కలిగి ఉంది.





Untitled Document
Advertisements