నటి వాణి విశ్వనాధ్, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పోటీనా?

     Written by : smtv Desk | Tue, Aug 29, 2017, 04:27 PM

నటి వాణి విశ్వనాధ్, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పోటీనా?

చెన్నై, ఆగస్ట్ 29: మలయాళ కుట్టి, అప్పట్లో చిరంజీవితో సమానంగా డాన్స్ చేసి కుర్రకారు గుండెలకు బాణాలు వేసిన నటి వాణి విశ్వనాధ్. సీనియర్ నేతల ఆహ్వానం మేరకు త్వరలో తెలుగు రాజకీయాల్లో రాబోతున్నట్లు వచ్చిన ఊహాగానాలు నిజ రూపం దాల్చాయి. ఈ విషయాన్ని ఇటీవల ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు తాను ఆంధ్రప్రదేశ్ నుండి రాజకీయారంగేట్రం చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఆదర్శమని వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ఆమె వెల్లడించారు. ఈ నేపధ్యంలో వాణివిశ్వనాథ్, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అన్ని విధాల పోటీ కాబోతున్నారనే అభిప్రాయాలు కూడా తెలుస్తున్నాయి.

Untitled Document
Advertisements