సినిమా బాగుందని చెప్పిన కేటీఆర్ పై మండిపడ్డ వీహెచ్..!

     Written by : smtv Desk | Tue, Aug 29, 2017, 05:04 PM

సినిమా బాగుందని చెప్పిన కేటీఆర్ పై మండిపడ్డ వీహెచ్..!

హైదరాబాద్, ఆగస్ట్ 29 : ఇటీవల విడుదలైన "అర్జున్ రెడ్డి" సినిమా ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచి ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని దీంతో యువత తప్పు దారి పడతారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మొదటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన కోపం చల్లారనట్టుంది. ఈ సినిమా చూసి బాగుందని చెప్పిన మంత్రి కేటీఆర్ పై కూడా వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇలాంటి అసభ్యకరమైన చిత్రాలను చూసి ప్రజలకు కేటీఆర్ ఏం చెప్పాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ కు హీరో విజయ్ దేవరకొండ బంధువవుతాడని... అందుకే సినిమా బాగుందన్నారని మండిపడ్డారు. ఈ సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని చూసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. "విజయ్ దేవరకొండ నటన బాగుంది. చాలా సహజత్వంతో ఈ చిత్రాన్ని తీశారని, ఇలాంటి సినిమాలు తీయాలంటే ఎంతో దైర్యం కావాలి” అని కితాబిచ్చిన విషయం విధితమే.

Untitled Document
Advertisements