మా సత్తా తెలిసిందా?: దక్షిణకొరియా

     Written by : smtv Desk | Tue, Aug 29, 2017, 05:41 PM

మా సత్తా తెలిసిందా?: దక్షిణకొరియా

దక్షిణకొరియా, ఆగస్ట్ 29: దక్షిణకొరియా అనుకున్నంత పని చేసి, వికృత చర్యలకు నాంది పలికింది. ఈ తెల్లవారుజామున ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు చేపట్టి, జపాన్ ను ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణకొరియా అధ్యక్షుడు ఉత్తరకొరియాపై బాంబులు వేయమని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించింది. ఉత్తర కొరియా సరిహద్దుకు కొంచెం దూరంలో ఏకంగా 8 బాంబులను యుద్ధ విమానాల ద్వారా జారవిడిచింది. దీంతో కొరియా ద్వీపకల్పం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య నలిగిపోతుంది. మరో వైపు పరిస్థితులు పూర్తిగా దిగజారుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరకొరియా క్షిపణులు అమెరికా ప్రాంతాన్ని చేరుకోవాలంటే, జపాన్ మీదుగానే వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలోనే ఉదయం జపాన్ మీదుగా ఫసిపిక్ లోకి ఉత్తరకొరియా మిస్సైల్ ప్రయోగించింది. దీనిపై కిమ్ జాంగ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.





Untitled Document
Advertisements