నేడు వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్

     Written by : smtv Desk | Fri, Sep 01, 2017, 01:23 PM

నేడు వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ నేడు 'నీతి ఆయోగ్' వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. మాజీ చైర్మన్ అరవింద్ పనగారియా స్థానంలో రాజీవ్ రావడం జరిగింది. లఖ్ నవూ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసిన ఆయన పాలసీ రీసర్చ్ సెంట్రల్ లో సీనియర్ సభ్యులుగా ఉన్నారు. గ‌తంలో ఫిక్కీకి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గా కూడా రాజీవ్ కుమార్ ప‌నిచేశారు. 2006 - 08 మ‌ధ్య నేష‌న‌ల్ సెక్యూరిటీ అడ్వైజ‌రీ బోర్డు స‌భ్యుడిగా, అంతేకాకుండా సీఐఐలో, ఏసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్‌లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ‌లో ఆయ‌న కీల‌క బాధ్య‌త‌లు పోషించారు. ఆగస్టు 1న నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి అరవింద్‌ పనగడియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొలంబియా విశ్వవిద్యాలయం తన సెలవు పొడిగింపునకు అంగీకరించలేదని.. అందుకే ఆగస్టు 31వ తేదీకల్లా నీతి ఆయోగ్‌ విధుల నుంచి వైదొలిగేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పనగడియా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందుకు ప్రధాని అంగీకారం తెలపడంతో గురువారం ఆయన ఉపాధ్యక్షుడి పదవి నుంచి తొలగిపోయారు.





Untitled Document
Advertisements