ప్రమాణ స్వీకారం చేయనున్న కేబినెట్ మంత్రులు

     Written by : smtv Desk | Sun, Sep 03, 2017, 11:45 AM

ప్రమాణ స్వీకారం చేయనున్న కేబినెట్ మంత్రులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: రాష్ట్రపతి భవన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమ కేబినెట్ లో తొమ్మిది మంది మంత్రులను అదనంగా తీసుకున్నారు. వీరిలో నలుగురు బ్యూరోకాట్లు, ఐదుగురు తొలిసారి లోక్ సభకు ఎన్నికైన వాళ్ళు... శివ ప్రతాప్ శుక్లా (రాజ్యసభ సభ్యుడు, యుపీ), అశ్విని కుమార్ చౌబే (లోక్ సభ సభ్యుడు, బక్సర్ -బీహార్), వీరేంద్ర కుమార్ (లోక్ సభ సభ్యుడు, తేకామత్-మధ్యప్రదేశ్), అనంతకుమార్ హేగ్దే ( లోక్ సభ సభ్యుడు, ఉత్తర కన్నడ), రాజ్ కుమార్ సింగ్ (లోక్ సభ సభ్యుడు, ఆర్ష్-బీహార్), హర్దీప్ సింగ్ పూరి (1974 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి), గజేంద్ర సింగ్ షెఖావత్ (లోక్ సభ సభ్యుడు, జోద్ పూర్-రాజస్థాన్), సత్యపాల్ సింగ్ (ముంబై మాజీ పొలీస్ కమిషనర్, యూపి), అల్ఫాన్స్ కన్నంథనమ్ (1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, కేరళ)లు కేబినేట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కేబినేట్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, కాబోయే మంత్రులు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

Untitled Document
Advertisements