తీవ్ర స్థాయిలో పడిపోయిన వాహన అమ్మకాలు!

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 12:26 PM

తీవ్ర స్థాయిలో పడిపోయిన వాహన అమ్మకాలు!

దేశీయ వాహానాల అమ్మకాలు తీవ్ర స్థాయిలో పడిపోయాయి. 18 ఏళ్లలో ఇదే అతిపెద్ద క్షీణత కావడం గమనార్హం. ఆర్థిక వృద్ధి మందగమనం, ఉద్యోగ కల్పన లేకపోవడం, కఠిన ద్రవ్యలభ్యత వంటి అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఢమాల్ అన్నాయి. విక్రయాలు పడిపోవడం ఇది వరుసగా ఏడో నెల. సియామ్ తాజా గణంకాల ప్రకారం.. మే నెలలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 2.39 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో వాహన అమ్మకాలు 3 లక్షల యూనిట్లుగా ఉండటం గమనార్హం. దీంతో విక్రయాల్లో 21 శాతం క్షీణత నమోదైంది. ఏప్రిల్‌లో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 17 శాతం తగ్గాయి. మోటార్‌సైకిల్ అమ్మకాలు కూడా దాదాపు 5 శాతం పడిపోయాయి. 12,22,164 యూనిట్ల నుంచి 11,62,373 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహన అమ్మకాలు 10 శాతం క్షీణతతో 68,847 యూనిట్లకు పడిపోయాయి.

Untitled Document
Advertisements