అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు: ఐసిసి

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 12:30 PM

అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు: ఐసిసి

ప్రపంచకప్ టోర్నీలో జింగ్ బెయిల్స్ పై పలు జట్ల కేప్టన్లు విసుగెత్తి ఐసిసికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఐసిసి మెగాటోర్నీ మధ్యలో ఎలాంటి మార్పులు చేయబోమని.. ఏదేమైనా అందరూ అవి వాడాల్సిందేనని స్పష్టం చేసింది. "గత వరల్డ్‌కప్ నుంచి అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇవే బెయిల్స్ వినియోగిస్తున్నాం. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు తలెత్తుతోంది. అదంతా ఆటలో భాగమే. టోర్నీ మధ్యలో మార్పులు చేయం. అన్ని జట్లు అదే సరంజామతో ఆడుతున్నాయి" అని ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే పలు మ్యాచ్‌ల్లో బౌలర్‌ వేసిన బంతులు వికెట్లను తాకినా ఎల్‌ఈడీ బెయిల్స్‌ మాత్రం కింద పడక పోవడంపై సర్వత్రా చర్చ జరగుతున్నది. దీంతో నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటించడానికి వీలుండదు. దీనిపై భారత్‌, ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లు ఎల్‌ఈడీ బెయిల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements