లీగ్ ఆఫ్ నేషన్స్ సాకర్: ట్రోఫి సొంతం చేసుకున్న పోర్చుగల్

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 12:31 PM

లీగ్ ఆఫ్ నేషన్స్ సాకర్: ట్రోఫి సొంతం చేసుకున్న పోర్చుగల్

లీగ్ ఆఫ్ నేషన్స్ సాకర్ టోర్నీలో యూరోసాకర్ చాంపియన్ పోర్చుగల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. పోర్టో వేదికగా జరిగిన టైటిల్ సమరంలో పోర్చుగల్ ఒకే ఒక్క గోలుతో నెదర్లాండ్స్ ను అధిగమించి ట్రోఫీ సొంతం చేసుకొంది.అయితే.ఆట 60వ నిముషంలో గాన్ కాడో గుడెస్ సాధించిన హెడర్ గోల్ తో పోర్చుగల్ విజేతగా నిలిచింది. గట్టిపోటీ ఎదురైనా తమజట్టు విజేతగా నిలవడం పట్ల కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సంతోషం వ్యక్తం చేశాడు.ప్రతిష్టాత్మక యూరోపియన్ సాకర్ టైటిల్ గెలుచుకొన్న తమ జట్టు .ఇప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ ట్రోఫీ సైతం నెగ్గి..ఆధిక్యత నిరూపించుకొందని.. క్రిస్టియానో రొనాల్డో గుర్తు చేశాడు.ఈ టోర్నీ సెమీఫైనల్లో స్విట్జర్లాండ్ ను 3-1 గోల్స్ తో పోర్చుగల్, ఇంగ్లండ్ ను నెదర్లాండ్స్ 3-1 గోల్స్ తో ఓడించడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements